గుంతకల్లు పట్టణంలోని హంపిరెడ్డి భవనంలో సీఐటీయూ అనుబంధ ప్రజా సంఘాలతో బుధవారం సమావేశం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర మాట్లాడుతూ లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మే 20 తేదీన దేశవ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మేడే కార్మిక దినోత్సవంలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.