గుంతకల్లులోని తిలక్ నగర్లో శనివారం కలుషిత మున్సిపల్ నీరు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీపీఎం నేతలు పరామర్శించారు. పట్టణ కార్యదర్శి మారుతీ ప్రసాద్ మాట్లాడుతూ కొళాయిల నుంచి పురుగులు, దుర్వాసనతో కూడిన నీరు వస్తుందని ఇప్పటికే పలుమార్లు కమిషనర్‌కు వినతులు ఇచ్చామని నిర్లక్ష్యం వహించిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.