గుంతకల్లు: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

81చూసినవారు
గుంతకల్లు: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత
గుంతకల్లు పట్టణ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రూరల్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి సీజ్ చేశారు. రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులను నిర్వహించామన్నారు. 80 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, సీజ్ చేశామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్