గుంతకల్లు: గంజాయి విక్రేతలు అరెస్టు

83చూసినవారు
గుంతకల్లు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వన్ టౌన్ సీఐ మనోహర్ మాట్లాడుతూ గంజాయి విక్రయిస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈదాడులు నిర్వహించామన్నారు. వారి వద్ద నుంచి మూడు కేజీల గంజాయి, ఒక కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్