ఆలూరు కాంగ్రెస్ నాయకుడు, దళిత నేత లక్ష్మీనారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, గుమ్మనూరు నారాయణనే హంతకుడిగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. రైలు టెండర్లు, కమీషన్ల వివాదం, భూ వివాదాల నేపథ్యంలో హత్యకు ప్రేరణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆదోని, గుంతకల్ చుట్టూ పక్కల గుమ్మనూరు కుటుంబంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు సొంత పార్టీ నుండే వస్తున్నా విషయం తెలిసిందే.