గుంతకల్లు మండలం నర్సాపురం గ్రామంలో కొన్ని రోజులుగా వైసీపీ కార్యకర్త బాషా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి శనివారం వారి స్వగ్రామానికి వెళ్లి కార్యకర్తను పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.