గుంతకల్లు: కసాపురం అంజన్నకు వెండి రథంలో ప్రాకారోత్సవం

51చూసినవారు
గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి సింధూర, ఆకు పూజలు జరిగాయి. శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. సాయంకాలం ఆలయ ఆవరణలో వెండి రథములో కొలువు తీర్చి స్వామివారి ఉత్సవమూర్తికి ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెండి రథమును ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్