గుత్తి పట్టణానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం వచ్చారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు విద్యాసంస్థల సమస్యలపై మంత్రి లోకేష్ కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గుత్తి పట్టణములో ప్రభుత్వ డిగ్రీ కళశాల, ప్రభుత్వ ఐ. టి. ఐ. కళశాల ఏర్పాటు చేయాలన్నారు. బేతాపల్లి గ్రామంలో యం. పి. పి. స్కూల్ లో ప్రభుత్వం చొరవ చూపి ఆ స్థలములో నూతన భవనము నిర్మించాలన్నారు.