తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుంతకల్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చిత్రపటాలతో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.