గుంతకల్లు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే కళాశాల విద్యార్థులు ఆర్టీసీ బస్సు సర్వీసులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గురువారం సాయంకాలం ఆర్టీసీ బస్సు కోసం విద్యార్థులు పరుగులు తీశారు. ఈ దృశ్యంపై స్థానికులు మండిపడ్డారు. విద్యార్థులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు స్పందించి, మరికొన్ని బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని విద్యార్థుల తండ్రిదండ్రులు కోరుతున్నారు.