గుంతకల్లు తిలక్ నగర్లో శనివారం మున్సిపాలిటీ సరఫరా చేసిన కలుషిత నీరు తాగి ఆరుగురు విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ అధికారులకు విషయాన్ని చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.