గుంతకల్లు: విద్యార్థుల ఫీజులను వెంటనే చెల్లించాలి

60చూసినవారు
గుంతకల్లు: విద్యార్థుల ఫీజులను వెంటనే చెల్లించాలి
ఫీజులను చెల్లించకుండా విద్యార్థులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైయస్సార్ ఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు బుధవారం మండిపడ్డారు. గుంతకల్లు వైసీపీ కార్యాలయంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పది నెలల పాలన కాలంలో విద్యార్థులకు ఫీజులు చెల్లించకపోవడంతో ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, విద్యార్థులకు ఫీజులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్