గుంతకల్లులో మొహరం వేడుకల్లో విషాద ఘటన జరిగింది. ఆదివారం తాటాకుల వీధిలో ఖయ్యూం భాషా అనే వ్యక్తి పీర్లను ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొంటుండా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కాలనీలో విషాదచాయలు నెలకొన్నాయి.