గుత్తిలో మంగళవారం విద్యుత్ ఉద్యోగుల యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రాఘవరెడ్డి హాజరై, విద్యుత్ కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గుత్తి డివిజన్ విద్యుత్ ఉద్యోగుల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించారు.