గుంతకల్లు హన్వేశ్ నగర్లోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ ను అందజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్, జెవివి రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ. విద్యార్థులు ఇష్టపడి చదివితేనే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని విద్యార్థులకు తెలిపారు.