గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుంతకల్లు మండలం జి. కొట్టాల గ్రామంలో శనివారం పర్యటించారు. ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు 3000 వేల రూపాయల పెన్షన్ ను ఒకేసారి 4000కి పెంచి అవ్వా తాతలకు పెద్ద కొడుకుగా వారిని ఆదుకుంటున్నారు అని అన్నారు.