గుంతకల్లు: పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

59చూసినవారు
గుంతకల్లు: పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్
గుంతకల్లోని మెయిన్ రోడ్డు పాత బస్టాండ్, కసాపురం రోడ్డులో బుధవారం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనులను మున్సిపల్ కమిషనర్ నయూమ్ అహ్మద్ పరిశీలించారు. రోడ్లు డ్రైనేజీ కాలువలు పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ అధికారులు ఆదేశించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చెత్తను బుట్టలలో నిల్వ ఉంచి చెత్త సేకరణ వాహనానికి అందివ్వాలని స్థానికులకు సూచించారు.

సంబంధిత పోస్ట్