గుంతకల్లులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బుధవారం దళిత సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దళిత సంఘం నాయకులు మహేంద్ర మాట్లాడుతూ. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని సెంట్రల్ జీవో ప్రకారం అమలు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని డిమాండ్ చేశారు.