గుంతకల్లులోని పరిటాల రవి కళ్యాణ మండపంలో బుధవారం సాగునీటి సంఘం ఛైర్మన్లు, వైఎస్ ఛైర్మన్లు, టీసీ నెంబర్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. అనంతరం సాగునీటి సంఘం ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లను శాలువాతో సత్కరించి సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి సంఘ ఎన్నికలు జరగలేదని గుర్తు చేశారు.