గుంతకల్లు ప్రశాంతి నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మంగళవారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్కు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సుధాకర్ మాట్లాడుతూ వార్డులో సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వార్డులో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని కమిషనర్కు వినతిపత్రం అందజేశామన్నారు.