పామిడి మండలం రామరాజుపల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఏర్పాటుచేసిన సమావేశంలో గురువారం రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి గెలుపునకు కార్యకర్తలు అడుగడుగునా పోరాడి విజయం సాధించారన్నారు. గత ప్రభుత్వం యువగళం పాదయాత్రలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని కార్యకర్తలకు వివరించారు. అయినా పట్టు విడువని విక్రమార్కుల్లా గెలిచామన్నారు.