గుంతకల్లులోని డీఎంఎం గేటు రోడ్డులో ఉన్న అరుణచల ఫ్యాన్సీ స్టోర్ నుంచి గత నెల 19న 25 వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసిన గోవిందమ్మ, లక్ష్మీలను శుక్రవారం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు మళ్లీ ఆ దుకాణానికి వచ్చి నగలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించగా యజమాని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.