గుత్తి: ఘనంగా దండు మారెమ్మ జాతర

81చూసినవారు
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీలో మంగళవారం దండు మారెమ్మ దేవరను ఘనంగా నిర్వహించారు. కాలనీకి చెందిన మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దండు మారెమ్మ దేవాలయంలో కలశాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవర సందర్భంగా దండు మారెమ్మ దేవతకు నైవేద్యం సమర్పించారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్