ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియో ఫిజీషియన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో అనంతపురం జిల్లా గుత్తికి చెందిన హోమియో డాక్టర్ శాంతి ప్రియకు అవకాశం దక్కింది. ఈనెల 13న గుంటూరులో జరిగిన అఖిలభారత హోమియో వైద్యుల సంఘం 18వ రాష్ట్రస్థాయి సదస్సులో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో రాష్ట్ర విభాగం కోఆర్డినేటర్గా డాక్టర్ శాంతిప్రియను ఎంపిక చేశారు. మంగళవారం ఆమెకు పలువురు హోమియో వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు.