అనంతపురం జిల్లాలోని నందమూరి బాలకృష్ణ నటించిన , డాకు మహారాజ్, మూవీ సందడి మొదలైంది. రేపు ఈ మూవీ రిలీజ్ కానుండగా బాలయ్య అభిమానులు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో పెద్ద సంఖ్యలో ప్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. గుత్తిలోని కెపిఎస్ థియేటర్ ను ఫ్లెక్సీలతో నింపారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు సినిమాను ప్రదర్శించినట్లు థియేటర్ నిర్వాహకుడు రాజేష్ తెలిపారు.