గుత్తి పట్టణంలోని దాసరి కాలనీలో ఐద్వా మహిళా సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఆ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. సంఘం మండల కార్యదర్శి రేణుక, జిల్లా కమిటీ సభ్యులు రేవతి, కవిత ఆధ్వర్యంలో కాలనీ మహిళలు ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. సీపీఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ మహిళల పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.