గుత్తి: అదుపు తప్పి బైక్ బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

55చూసినవారు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని మార్నేపల్లి గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గుంతకల్లు మండలం వైటీ. చెరువు గ్రామానికి చెందిన షంషీర్, గుత్తి పట్టణానికి చెందిన షాకీర్ భాషలు పని నిమిత్తం గుత్తి నుంచి వైటీ. చెరువు గ్రామానికి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్