30 సార్లు కంటే ఎక్కువ రక్తదానం చేసిన నలుగురు యువకులను శనివారం ఘనంగా సన్మానించారు. గుత్తిలోని పోలీస్ స్టేషన్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రక్త దాతలు షేక్షావలి, మున్నా, పీరా, నజీర్ను సీఐ వెంకటేశ్వర్లు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిప్రసాద్ యాదవ్ సన్మానించారు. రక్తదానం అన్ని దానాల కంటే గొప్పదని సీఐ అన్నారు.