గుత్తి మండల శివారులోని మామిళ్ళపల్లి సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు. మామిళ్ళపల్లికి చెందిన బాలుడు సుమంత్ బైక్ పై ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో సుమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యానికి అనంతపురం రెఫర్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.