గుత్తి పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెడుతున్నారు. ఇందులో భాగంగా డ్రోన్ కెమెరా ద్వారా గుత్తి పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. డ్రోన్ కెమెరా ద్వారా బహిరంగంగా మద్యం సేవిస్తున్న మందు బాబులను పసిగట్టారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం పోలీస్ సిబ్బంది డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించిన ఐదుగురు మందుబాబులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.