గుత్తి మండలం ఊటకల్లు గ్రామంలో పొలం సరిహద్దు విషయంలో మాట మాట పెరిగి గురువారం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో సుబ్బరాయుడు అనే రైతు రామాంజనేయులు, సురేంద్ర అనే రైతుపై రాళ్లతో దాడి చేసి గాయపరిచినట్లు స్థానికులు వివరించారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని వారిని చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.