గుత్తి ఆర్ఎస్ లో శనివారం గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా రైల్వే స్టేషన్ను పరిశీలించారు. అనంతరం సీఅండ్ డబ్ల్యూ డిపోను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే అధికారులు, కార్మికులతో మాట్లాడారు. అంతకుముందు డీఆర్ఎంకు రైల్వే అధికారులు, కార్మికులు బొకేలు అందజేసి స్వాగతం పలికారు. సుమారు రెండు గంటల పాటు డీఆర్ఎం పర్యటించారు.