గుత్తి: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో వృద్ధురాలి మృతి

67చూసినవారు
గుత్తి: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో వృద్ధురాలి మృతి
గుత్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ నెల 5న రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన నాగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా శుక్రవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్