అనంతపురం జిల్లా సీపీఎం కమిటీ సభ్యురాలుగా గుత్తికి చెందిన సీపీఎం సీనియర్ నాయకురాలు నిర్మల ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యురాలుగా ఎన్నికైన నిర్మల మాట్లాడారు. సీపీఎం సిద్ధాంతాలు, విధానాలకు అనుగుణంగా నడుచుకుంటానన్నారు. ప్రజా, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్య మాలు చేపడతానన్నారు. నిర్మలను ఆ పార్టీ నాయకులు అభినందించారు.