గుత్తి పట్టణంలో అతి పవిత్రమైన పీర్ల బావి అపరిశుభ్రతకు కేరాఫ్ గా మారిపోయింది. పీర్ల బావిలో చెత్తాచెదారం పేరుకుపోయింది. కంప చెట్లు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. చుట్టుపక్కల వారు చెత్తాచెదారాన్ని పీర్ల బావిలో వేస్తున్నారు. దీంతో పీర్ల బావి కాస్త చెత్త బావిగా మారిపోయింది. పీర్ల పండుగ సందర్భంలో పీర్లను ఈ బావిలో స్నానం చేయిస్తారు. అలాంటి పవిత్రమైన బావి అపరిశుభ్రంగా మారిపోయి దుర్వాసన వెదజల్లుతోంది.