గుత్తి పట్టణంలో అతి పురాతనమైన వక్కలకుంట చెత్తాచెదారానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. వక్కల కుంటలో చెత్తాచెదారంతో పాటు కంప చెట్లు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. చుట్టుపక్కల వారు ఇళ్లలోని చెత్తాచెదారాన్ని కుంటలో పడేస్తున్నారు. దీంతో కుంట అపరిశుభ్రంగా మారిపోయి దుర్వాసన వెదజల్లుతున్నది. కుంటలో నీళ్లు సమృద్ధిగా ఉంటే చుట్టుపక్కల బోర్లలో నీళ్లు పుష్కలంగా లభిస్తాయి.