అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై హిజ్రా దాడి కి పాల్పడింది. ఆదివారం మధ్యాహ్నం గుత్తి నుండి గుంతకల్లు వైపు వెళుతున్న బస్ బస్టాండ్ నుండి బయలుదేరింది. బస్సు మెయిన్ రోడ్డులోకి రాగానే హిజ్రా తన సోదరుడితో పాటు బస్సు ఆపే ప్రయత్నం చేయగా బస్సు డ్రైవర్ ట్రాఫిక్ జామ్ అవుతుందని బస్సు ఆపకుండా ముందుకు వెళ్ళాడు. దీంతో అసహనానికి గురైన హిజ్రా బస్సుకు అడ్డుగా నిలబడింది. అనంతరం బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడింది. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.