అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియా బేగం శ్రీకాళహస్తి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.