గుత్తి మండలం సమీపం లోని తుగ్గిలి మండలం గొల్లవానిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య ఆచారి విష ద్రావణం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.