అనంతపురం జిల్లా గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన ఎల్లప్ప ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామ శివారులో ఆయన ఈ ఘటనకు పాల్పడగా స్థానికులు గమనించి గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనంతపురం తీసుకెళ్లారు. ఫీల్డ్ అసిస్టెంట్ విషయంలో జరుగుతున్న వివాదం కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది.