గుత్తి మండల శివారులోని జి. ఎర్రగుడి గ్రామంలో మంగళవారం విషాద ఘటన జరిగింది. ఆంజనేయులు అనే వ్యక్తి కంది కోత యంత్రంపై నిలుచుని మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి కిందపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆంజనేయులును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.