గుత్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ మీనాక్షి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించామన్నారు.