గుత్తి మండలం బేతపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. అనంతరం రెన్యూ సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.