ఈ నెల 15న గుత్తి మండలంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించనున్నారు. ఈ మేరకు బేతాపల్లి, ఊటకల్లు గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న సోలార్ ప్రాజెక్ట్ కు మంత్రి చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నారు. దీంతో మంగళవారం ఆ స్థలాన్ని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూర్ జయరాం, తహశీల్దార్ ఓబులేసు, గుత్తి సీఐ వెంకటేశ్వర్లు, సోలార్ ప్రాజెక్ట్ అధికారులు పరిశీలించారు. గుత్తి టౌన్ కన్వీనర్ చౌదరి, మండల కన్వీనియర్ బద్రివలీ, రామంజి తదితరులు పాల్గొన్నారు.