అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని 22వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి నూతన పైప్‌లైన్ ఏర్పాటు పనులు చేపట్టారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, వార్డు ఇన్‌చార్జ్ చికెన్ శీనా ఈ పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు ఈ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.