గుత్తి మునిసిపాలిటీలో ఈనెల 4న సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 31న జరగాల్సిన కౌన్సిల్ సమావేశం వాయిదా పడటంతో ఈనెల 4న ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు తప్పక హాజరు కావాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.