నవంబర్ 51 స్టాంపుల కోసం రూ. 13 వేలు విలువైన చలానా కట్టానని, ఇంతవరకు సబ్ రిజిస్టర్ తనకు స్టాంపులు ఇవ్వడం లేదని గుత్తికి చెందిన స్టాంప్ వెండర్ రామ సుబ్బారెడ్డి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడారు. తన తర్వాత చాలానా కట్టిన స్టాంప్ వెండర్లకు సబ్ రిజిస్టర్ స్టాంపులు ఇచ్చారు. అయితే తనకు మాత్రం స్టాంప్లు ఇవ్వలేదు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తానన్నారు.