గుత్తి మున్సిపాలిటీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూరగాయల మార్కెట్లోని దుకాణాల నిర్వహకులు టాక్స్ చెల్లించడం లేదని బుధవారం మున్సిపాలిటీ అధికారులు కూరగాయల మార్కెట్లోని దుకాణాల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ రెండేళ్లుగా కూరగాయల మార్కెట్ లోని దుకాణాల నిర్వాహకులు టాక్స్ చెల్లించకపోవడంతో నోటీసులు జారీ చేశామన్నారు.