గుత్తి: రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు

68చూసినవారు
గుత్తిలోని కొత్తూరు కాలనీలో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇళ్లలోని మురికి నీరు అంతా రోడ్లపై ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఉంటే ముందుకు ఎలా వెళ్లాలని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో ఇళ్లలోని మురుగనీరు అంతా రోడ్లపైకి వస్తోందని అన్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలు నిర్మించాలని కాలనీవాసులు కోరారు.

సంబంధిత పోస్ట్