ప్లాస్టిక్ క్రయవిక్రయాలను పూర్తిగా నిషేధించామని, ఎవరైనా ప్లాస్టిక్ విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవని గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం హోటళ్ల నిర్వాహకులు, దుకాణం దారులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలన్నారు.